BRS నేత శ్రీధర్‌ ది రాజకీయ హత్యనే..రేవంత్, జూపల్లి రాజీనామా చేయాలి – ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌

-

నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు అండతో బీఆరెస్ నాయకుల పై పట్టపగలే దాడులు జరుగుతున్నాయి, వాళ్ల ప్రాణాలకు పెను ప్రమాదం పొంచి ఉందని తెలంగాణ డీజీపీకి మేము ఫిర్యాదు చేసిన పది రోజుల్లోనే వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం లక్ష్మీపల్లి గ్రామంలో BRS నాయకులు, మృదు స్వభావి, శ్రీధర్ రెడ్డి గారు చాలా దారుణంగా హత్యకు గురయ్యారని ఆర్ఎస్‌ ప్రవీణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇది ముమ్మాటికి రాజకీయ హత్యనే. తెలంగాణలో ప్రతిపక్షమే ఉండకూడదని పక్కా ప్లాను ప్రకారమే కాంగ్రేసు ప్రభుత్వం హత్యల సంస్కృతికి తెరలేపింది. ఇది ప్రజా పాలన కాదు-ప్రతీకార పాలన అంటూ ఫైర్‌ అయ్యారు. మంత్రి అండదండలతో యధేచ్చగా జరుగుతున్న దాడుల్లోఅధికార పార్టీ నిందితులను వెంటనే అరెస్ట్ చేసి వారిని పీడీ యాక్ట్ లాంటి చట్టాలను ప్రయోగించి జైల్లో పెట్టకపోవడం వల్లనే ఇలాంటి వరుస హత్యలు జరుగుతున్నాయి….నిందితులతో కుమ్మక్కైతున్న కొందరు స్థానిక పోలీసు అధికారులను,ఎంతటి వారైనా సరే, వారిపై డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేసి తప్పకుండా శిక్షించాలి.

బదిలీ చేయాలని డిమాండ్‌ చేశారు. మంత్రి జూపల్లి కృష్ణారావును మంత్రి వర్గం నుండి వెంటనే బర్తరఫ్ చేయాలి….కొల్లాపూర్, నాగర్ కర్నూల్ , అచ్చంపేట నియోజవర్గాల్లోని సమస్యాత్మక గ్రామాల్లో వెంటనే కేంద్ర బలగాలు/స్పెషల్ పోలీసు బలగాలతో పికెట్లను ఏర్పాటు చేయాలన్నారు. ప్రాణాలకు ముప్పున్న బీఆరెస్ మరియు ఇతర ప్రతిపక్ష పార్టీల ప్రజాప్రతినిధులకు వెంటనే రక్షణ కల్పించాలనికోరారు. తెలంగాణ రాష్ట్రంలో అడుగంటిన శాంతిభద్రతలకు నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి-హోంమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి….కాంగ్రేసు గూండాలారా, మీ వరుస దాడులకు బెదరం అదరం. మీ మాఫియాలను రాజ్యాంగబద్ధంగా కుప్పకూల్చే దాకా నిద్రపోం.ఖబర్దార్! అంటూ హెచ్చరించారు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌.

Read more RELATED
Recommended to you

Latest news