ఇటీవల తెలంగాణ ఆర్టీసీ చైర్మెన్ బాధ్యతల ను నిజమాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ స్వీకరించారు. అయితే తాజాగా ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను ఆర్టీసీ చైర్మెన్ గా బాధ్యతలు ఉన్నంతా కాలం ఎలాంటి జీతభత్యాలు తీసుకోనని బాజిరెడ్డి గోవర్ధన్ స్పష్టం చేశారు. ఇప్పటి కే తీవ్ర నష్టాల తో ఉన్న ఆర్టీసీ కి తన జీతం తో మరింత భారం పడకుండా ఉండాలని ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు బాజిరెడ్డి గోవర్ధన్ వెల్లడించారు.
తను ఒక ఎమ్మెల్యే నని.. ఎమ్మెల్యే జీతభత్యాలు తనకు సరిపోతాయని అన్నారు. ఈ విషయం పై తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కు కూడా లేఖ రాశాడు. కాగ తెలంగాణ ఆర్టీసీ గత మూడు సంవత్సరాల నుంచి తీవ్ర నష్టాలలో ఉంది. నష్టాల నుంచి ఆర్టీసీ సంస్థ ను బయట పడేయడానికి ఇటీవల ముఖ్య మంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ కి ఎండీ గా సజ్జనార్ ను చైర్మెన్ గా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ను ఎంపిక చేశారు. అప్పటి నుంచి టీఎస్ ఆర్టీసీ ని లాభాల బాట పట్టించ డానికి అధికారులు కష్ట పడుతున్నారు.