సొంత కూతురుపైనే అత్యాచారం.. భయపెట్టి ఏడాదిగా… గర్భవతిని చేసిన కామాంధుడు

-

కంటికి రెప్పటా కాపాడాల్సిన వాడే కాటేశాడు. వావీ వరసలు మరిచి సొంత కూతురుపైనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. భయపెట్టీ మరీ తన కామ కోరికను తీర్చుకున్నాడు. ఫలితంగా సొంత కూతురునే గర్భవతినే చేశాడు కామాంధుడు. ఈ దుర్మార్గమైన సంఘటన వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.

అత్యాచారం

వివరాల్లోకి వెళితే… కన్నతండ్రే సొంతకూతురిపై ఏడాది కాలంగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరిస్తూ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ఆ బాలిక మూడు నెలల గర్భవతి. బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని ఓ గ్రామంలో నివసిస్తున్న దంపతుకు ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. ఇదిలా ఉంటే కుమారుడితో కలిసి నాలుగేళ్ల క్రితం పటాన్ చెరుకు వలస వెళ్లారు. భార్య వెంచర్ లో పని చేస్తుండగా.. భర్త ఆటోనడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. 15 ఏళ్ల వయసున్న పెద్ద కూతురు ఇంటి వద్దే ఉంటుంది. అయితే ఎవరూ లేని సమయంలో మధ్యహ్నం పూట ఇంటికి వచ్చే తండ్రి.. పెద్ద కూతురును బెదిరిస్తూ ఏడాదిగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఇటీవల తల్లి.. ముగ్గురు పిల్లలతో కలిసి సొంతూరుకు వచ్చింది. పెద్ద కూతురు అస్వస్థతకు గురి కావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లింది. బాలిక మూడో నెల గర్భవతని వైద్యులు చెప్పారు. షాక్ తిన్న తల్లి.. కూతురుని నిలదీయగా.. జరిగిన విషయం చెప్పింది.  అనంతరం భర్తను నిలదీసింది. అతడు అందర్నీ చంపేస్తానని బెదిరించి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో బాలికకు ఆబార్షన్‌ చేయించాడు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news