కిన్నెర మొగుల‌య్య ను సన్మానించిన ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌నార్

ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితం అని పాట పాడిన కిన్నెర మొగులయ్య ను ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌నార్ సన్మానించాడు. ఆర్టీసీ ని కిన్నెర మొగుల‌య్య ప్ర‌మోట్ చేస్తూ పాట పాడ‌టం చాలా మంచి విష‌యం అని అన్నారు. అయితే గ‌త రెండు రోజుల క్రితం కిన్నెర మొగుల‌య్య ఆర్టీసీ బ‌స్సు ల‌లో ప్రయాణం సుర‌క్షితం అంటూ పాట పాడాడు.

ఈ పాట రెండు రోజుల పాటు సోష‌ల్ మీడియా లో వైర‌ల్ అయింది. కిన్నెర మొగులయ్య పాడిన ఆర్టీసీ పాట వీడియో కు సోష‌ల్ మీడియా లో లక్షలలో వ్యూస్, లైక్ లు వ‌చ్చాయి. దీంతో ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌నార్ కిన్నెర‌ మొగులయ్యని ఘనంగా సన్మానించారు. అలాగే కిన్నెర మొగుల‌య్య పాట ప‌ట్ల ధ‌న్య‌వాద‌లు తెలిపారు. అలాగే కిన్నెర మొగుల‌య్య కు బంపర్ ఆఫ‌ర్ కూడా ప్ర‌క‌టించాడు. రాష్ట్ర వ్యాప్తంగా కిన్నెర మొగుల‌య్య కు ఆర్టీసీ బ‌స్సు ల‌లో ఉచితంగా ప్రయాణించే అవ‌కాశం కల్పించారు.