ప్రైవేటు వాహనాల్లో వెళ్లవద్దు.. RTCని వాడండి : సజ్జనార్

-

ప్రైవేటు వాహనాల్లో వెళ్లవద్దు..RTCని వాడండని కోరారు ఆర్టీసీ ఎండి సజ్జనార్. బతుకమ్మ, దసరాకు ప్రయాణించేవారు ప్రైవేట్ వాహనాల్లో వెళ్ళవద్దని, ఆర్టీసీలో సురక్షితంగా ప్రయాణించాలని ఆర్టీసీ ఎండి సజ్జనార్ కోరారు. అక్టోబర్ 13-24 తేదీల మధ్య ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామన్నారు. ఈ సారి సుమారు 1000 బస్సులు ఆదనంగా తిప్పుతున్నట్లు తెలిపారు.

ప్రత్యేక సర్వీసుల్లో tsrtconline.inలో ముందస్తు రిజర్వేషన్ చేసుకోవచ్చన్నారు. పూర్తి సమాచారం కోసం 040-69440000, 040-23450033ను సంప్రదించాలన్నారు. కాగా దసరా పండుగకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన  సర్వీసులన్నీ ఎంజిబిఎస్, జూబ్లీ బస్ స్టేషన్, ఉప్పల్ క్రాస్ రోడ్డు, దిల్ సూక్ నగర్, గౌలిగూడ, సిబిఎస్ తదితర ప్రాంతాల నుంచి అందుబాటులో ఉంటాయన్నారు. ఏదైనా కాలనీలో 30 మంది, అంతకంటే ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులు ఉంటే ఆయా ప్రాంతాల నుంచి బస్సులు ఏర్పాటు సౌలభ్యం కూడా ఉందని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news