రైతుబంధులోనూ గోల్‌మాల్‌.. రూ.2 కోట్లు స్వాహా

-

రాష్ట్రంలో రైతు బీమా, రైతు బంధు పథకాల ద్వారా దాదాపు రూ.2 కోట్లు స్వాహా చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక వ్యవసాయ విస్తరణ అధికారిని సైబరాబాద్‌ ఆర్థిక నేరాల విభాగం(ఈవోడబ్ల్యూ)అధికారులు ఆదివారం రోజున అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరిని కూడా ఇదే వ్యవహారంలో విచారించినట్లు తెలిసింది. 20 మంది బతికున్న రైతులను చంపేసి వారి పేరిట నకిలీ పత్రాలు సృష్టించి బీమా తీసుకున్నాట్లు అధికారులు గుర్తించారు. తప్పుడు రికార్డులతో రైతుబంధు నిధులు పొందినట్లు తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం మరణించిన రైతులకు బీమా కింద రూ.5 లక్షలు, రైతుబంధు కింద పెట్టుబడి కోసం ఎకరాకు ఏటా రూ.10 వేల చొప్పున సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. దీన్ని రంగారెడ్డి జిల్లా కొందర్గు మండల వ్యవసాయ శాఖలోని కొందరు అవకాశంగా మార్చుకుని తమ పరిధిలోని రైతుల వివరాలు సేకరించి.. 20 మంది మరణించినట్లు తప్పుడు పత్రాలు సృష్టించారు. వాటి ఆధారంగా బీమాకు దరఖాస్తు చేసి, సుమారు రూ.కోటి స్వాహా చేశారు.  ముంబయిలోని ప్రధాన కార్యాలయం ఇచ్చిన సమాచారంతో అధికారులు సైబరాబాద్‌ ఈవోడబ్ల్యూలో ఫిర్యాదు చేశారు. ఈ కేసు విచారణ క్రమంలోనే రైతుబంధు నిధులు రూ.కోటి పక్కదారి పట్టినట్లు వెలుగులోకి వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news