రైతుబంధులో రెండో రోజు రూ.1,278.60 కోట్లు విడుదల

-

తెలంగాణ రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు ప్రవేశ పెట్టిన రైతు బంధు ద్వారా ఎంతో మంది కర్షకులు లబ్ధి పొందుతున్నారు. ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా వానా కాలం పంట పెట్టుబడి సాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు నిధులు విడుదల చేసింది. ఇప్పటికే సోమవారం ఈ నిధులు విడుదల చేసిన సర్కార్.. మంగళవారం రెండోరోజు రూ.1278.60 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం 16,98,957 మంది రైతుల ఖాతాల్లో జమ చేసింది.

మొత్తంగా రెండు రోజుల్లో 39,54,138 మంది రైతుల ఖాతాల్లో రూ.1921.18 కోట్లు జమచేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. తొలిరోజు ఎకరం విస్తీర్ణం భూమి ఉన్న వారికి, రెండో రోజు రెండెకరాల విస్తీర్ణమున్న వారికి సాయం విడుదలైంది. ఇప్పటివరకు 38.42 లక్షల ఎకరాలకు రైతుబంధు నిధులను విడుదల చేశామన్నారు. బుధవారం మూడెకరాలు, ఆ తర్వాత నాలుగు, అయిదు ఎకరాల రైతులకు సాయం విడుదల ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఈ నిధులను సద్వినియోగం చేసుకోవాలని నిరంజన్‌రెడ్డి రైతులను కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version