ప్రతి వారం రుణమాఫీ నిధుల జమ.. సెప్టెంబరు 15 నాటికి ప్రక్రియ పూర్తి

-

తెలంగాణ సర్కార్ ఇటీవలే రైతులకు తీపి కబురు అందించింది. పంట రుణాలను మాఫీ చేయనున్నట్లు ప్రకటించింది. అయితే తాజాగా పంట రుణాల మాఫీ ప్రక్రియను పునఃప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ఇకపై వారానికి కొంత మొత్తం చొప్పున నిధులు జమ చేయనున్నట్లు తెలిపింది. ఈ నెల 3న రూ.18,241 కోట్లకు ఆర్థికశాఖ బడ్జెట్‌ రిలీజ్‌ ఆర్డర్‌ విడుదల చేసింది. అదే రోజు రూ.37 వేల- 41 వేల మధ్య ఉన్న రుణాలున్న 62,758 మంది రైతులకు మాఫీ చేస్తూ రూ.237.85 కోట్లు జమ చేసింది.

రెండో విడతలో 5,86,270 మందికి రూ.1374.96 కోట్లు మాఫీ అయ్యాయి. ఇంకా 25.98 లక్షల మంది రైతులకు రూ.18,004 కోట్లు అందాల్సి ఉంది. వీటిని ఈ నెల నుంచి వచ్చే నెల రెండో వారం వరకు అయిదు విడతల్లో విడుదలకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటివరకు రూ.41 వేల వరకు రుణం ఉన్న వారికి చెల్లింపులు పూర్తయ్యాయి. మిగిలిన వారిని అయిదు కేటగిరీలుగా చేసి ప్రతి వారం నిధులు జమ చేయనున్నారు. మొత్తానికి సెప్టెంబరు 15 నాటికి రూ.లక్ష వరకు మాఫీ చేసి ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం ఆర్థికశాఖకు నిర్దేశించింది.

Read more RELATED
Recommended to you

Latest news