సాహితీ ఇన్ఫ్రా ఎండీ లక్ష్మీ నారాయణ అరెస్ట్ అయ్యారు. ఫ్రీ లాంచ్ పేరుతో కోట్ల రూపాయలకు కుచ్చుటోపి పెట్టిన లక్ష్మీనారాయణ అరెస్ట్ అయ్యారు. సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఫ్రీ లాంచ్ ఆఫర్లు నడుస్తున్నాయి. 2019 నుండి ఫ్రీ లాంచ్ ఆఫర్లు సాహితీ ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కొనసాగిస్తోంది. తక్కువ ధరకే ప్లాట్లను విక్రయిస్తున్నామంటూ ఫ్రీ లాంచ్ ఆఫర్ ను ప్రకటించింది సాహితి.
సుమారు 2728 మంది నుండి 1500 కోట్ల రూపాయలు వసూలు చేసింది సాహితీ. ఆ తర్వాత నుండి ప్లాట్ల నిర్మాణాలు చేపట్టక పోవడం, సాహితీ లక్ష్మీనారాయణ పరారీలో ఉండడంతో ఆందోళనలో కొనుగోలుదారులు ఉన్నారు. ఈ తరుణంలోనే… సుమారు 1000 కి పైగా పిటీషన్లను దాఖలు చేశారు బాధితులు. ఎట్టకేలకు లక్ష్మీనారాయణ ను అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు… ఆదివారం సాయంత్రం వరకు లక్ష్మీనారాయణ స్టేట్మెంట్లను రికార్డు చేశారు. ఇవాళ లక్ష్మీ నారాయణ ను కోర్టులో హాజరుపరచనున్నారు ఈడీ అధికారులు.