ములుగు జిల్లాలోని మేడారం సమ్మక్క- సారక్క హుండీ ఆదాయం రూ.43 లక్షలు క్రాస్ అయింది. మేడారం సమ్మక్క సారలమ్మ హుండీలను తాజాగా లెక్కించారు అధికారులు. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 28 వరకు భక్తులు వేసిన కానుకలు లెక్కింపు చేశారు అధికారులు.
అధికారుల లెక్కల ప్రకారం సమ్మక్క హుండీ ఆదాయం 22, 36,654 లక్షలుగా నమోదు అయింది. సారలమ్మ హుండీ ఆదాయం 18, 67, 016 లక్షలుగా నమోదు అయింది. పగిడిద్దరాజు హుండీ ఆదాయం 91, 636 లక్షలుగా నమోదు అయింది. గోవిందరాజుల హుండీ ఆదాయం 1,17,761 లక్షలుగా నమోదు అయింది. ఇక మేడారంలోని 10 హుండీలో మొత్తం ఆదాయం 43,129,77 లక్షలుగా నమోదు అయింది.