ఏప్రిల్ 1నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం.. జిల్లాల వారీగా లక్ష్యం ఖరారు

-

రాష్ట్రవ్యాప్తంగా రబీ (యాసంగి) ధాన్యం కొనుగోళ్లు మరో మూడ్రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్ల లక్ష్యాలు జిల్లాల వారీగా ఖరారయ్యాయి. అత్యధికంగా నిజామాబాద్‌ జిల్లాలో 6.24 లక్షల టన్నులు, తర్వాత స్థానాల్లో జగిత్యాల, నల్గొండ, కామారెడ్డి, మెదక్‌, యాదాద్రి జిల్లాలు ఉన్నాయి. హైదరాబాద్‌ మినహా 32 జిల్లాల్లో 7,149 కొనుగోలు కేంద్రాల ద్వారా 75.40 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనాలని పౌరసరఫరాల సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.

సూర్యాపేట 3,69,626 కరీంనగర్‌ 3,64,525, సిద్దిపేట 3,64,525, సిరిసిల్ల 3,12,451, పెద్దపల్లి 3,12,450, నాగర్‌కర్నూల్‌ 2,31,400, జనగామ 2,18,716, వనపర్తి 2,08,300, నిర్మల్‌ 2,05,473, సంగారెడ్డి 1,96,519, మంచిర్యాల 1,82,044, మహబూబాబాద్‌ 1,77,075, హనుమకొండ 1,67,923, వరంగల్‌ 1,56,225, నారాయణపేట 1,41,238, మహబూబ్‌నగర్‌ 1,29,746, భూపాలపల్లి 1,27,038, ఖమ్మం 1,24,980, వికారాబాద్‌ 1,24,303, గద్వాల 1,04,150, ములుగు 88,528, కొత్తగూడెం 67,697, రంగారెడ్డి 41,660, ఆసిఫాబాద్‌ 36,510, మేడ్చల్‌ 26,037, ఆదిలాబాద్‌ 655 టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని పౌరసరఫరాల శాఖ లక్ష్యం నిర్ణయించింది.

Read more RELATED
Recommended to you

Latest news