ఇక సెంట్రల్ జైలుగా.. సంగారెడ్డి జిల్లా జైలు

-

సంగారెడ్డి జిల్లా జైలుకు సెంట్రల్ జైలు హోదాను కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం జైలు అధికారులు సంగారెడ్డి జిల్లా జైలు బోర్డును కేంద్ర కారాగారంగా మార్చారు. సంగారెడ్డి జిల్లా జైలులో ప్రస్తుతం 510 మంది ఖైదీలు, 33 మంది వార్డర్లు, జైలర్, డిప్యూటీ జైలర్, సూపరింటెండెంట్ లు ఉన్నారు.

మెదక్, సంగారెడ్డి, కూకట్పల్లి పరిధిలోని దాదాపు 30 కోర్టుల నుంచి శిక్ష పడిన ఖైదీలు సంగారెడ్డి జిల్లా జైలులో ఉన్నారు. సెంట్రల్ జైలుగా హోదా లభించడంతో సిబ్బంది, ఖైదీల సంఖ్య పెరగనుందని జైలు సూపరింటెండెంట్ దండ భరత్ రెడ్డి తెలిపారు. అందుకు తగినట్టుగా నూతన కాంప్లెక్స్ భవనాల నిర్మాణం కూడా త్వరలోనే ప్రారంభించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. త్వరలో సంగారెడ్డి జైలులో వెయ్యిమంది ఖైదీలకు ఒక ఎస్పీ కేడర్ సూపరింటెండెంట్, 70 నుంచి 90 వరకు వార్డర్లు, ఇద్దరు డిప్యూటీ సూపరింటెండెంట్ లు, నలుగురు జైలర్లు విధులు నిర్వహించనున్నట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version