ఆర్టీసీ గుడ్ న్యూస్.. సంక్రాంతి ప్రత్యేక బ‌స్సుల‌కు అద‌న‌పు ఛార్జీలు లేవు

తెలంగాణ ఆర్ట‌సీ ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతి కానుకగ 4,318 ప్ర‌త్యేక బ‌స్సుల‌ను న‌డుపుతున్నారు. అయితే సంక్రాంతికి టీఎస్ ఆర్టీసీ న‌డుపుతున్న ప్ర‌త్యేక బ‌స్సుల‌కు ఎలాంటి అద‌న‌పు ఛార్జీలు ఉండ‌వ‌ని ఆర్టీసీ చైర్మెన్ బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్, ఎండీ స‌జ్జ‌నార్ ప్ర‌క‌టించారు. సంక్రాంతి పండుగ నేప‌థ్యంలో ప్ర‌త్యేక బ‌స్సులు ఈ నెల 7 నుంచి 14 వ‌రకు న‌డ‌ప‌నున్న‌ట్టు తెలిపారు. సంక్రాంతి కోసం నడుపుతున్న 4,318 ప్ర‌త్యేక బ‌స్సులు హైద‌రాబాద్ నుంచి ఇత‌ర జిల్లాల‌కు న‌డుపుతున్నామ‌ని తెలిపారు.

అలాగే ప‌క్క రాష్ట్రం ఆంధ్ర ప్ర‌దేశ్ కు కూడా భారీ సంఖ్య‌లో టీఎస్ ఆర్టీసీ బ‌స్సుల‌ను న‌డ‌ప‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఆంధ్ర ప్ర‌దేశ్ కు వెళ్లే టీఎస్ ఆర్టీసీ ప్ర‌త్యేక బ‌స్సుల‌కు కూడా అద‌న‌పు ఛార్జీలు ఉండ‌వ‌ని స్ప‌ష్టం చేశారు. ఈ ప్ర‌త్యేక బ‌స్సులు హైద‌రాబాద్ లోని జేబీఎస్, ఎంజీబీఎస్ తో పాటు న‌గ‌రంలో ముఖ్య‌మైన సెంట‌ర్ ల‌లో ఉంటాయ‌ని తెలిపారు. అలాగే సంక్రాంతి ప్ర‌త్యేక బ‌స్సుల‌ను ప‌ర్య‌వేక్షించ‌డానికి 200 మంది అధికారుల‌ను సిబ్బందిని నియ‌మిస్తున్న‌ట్టు తెలిపారు. అలాగే టీఎస్ ఆర్ట‌సీ బ‌స్సుల‌ల్లో ముంద‌స్తుగా టికెట్లు రిజ‌ర్వేష‌న్ చేసుకోవ‌డానికి అధికారిక వెబ్ సైట్ www.tsrtconline.in ను సంప్ర‌దించాల‌ని సూచించారు.