ప్రిన్స్ మ‌హేష్ బాబుకు క‌రోనా పాజిటివ్

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుకు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. ఈ విష‌యాన్ని సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు త‌న ట్విట్ట‌ర్ ద్వారా అధికారికంగా తెలిపారు. త‌న‌కు స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు వ‌చ్చాయ‌ని దీంతో క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష చేసుకున్నాని తెలిపారు. అయితే నిర్ధార‌ణ ప‌రీక్ష‌లో పాజిటివ్ గా నిర్ధార‌ణ అయింద‌ని తెలిపారు.

అయితే త‌న‌కు స్వ‌ల్ప ల‌క్ష‌ణాలే ఉన్నాయ‌ని మ‌హేష్ బాబు తెలిపారు. పాజిటివ్ నిర్ధార‌ణ కావ‌డంతో త‌న ఇంట్లోనే సెల్ఫ్ ఐసోలేష‌న్ ఉంటున్నాని తెలిపారు. అలాగే డాక్ట‌ర్ల స‌ల‌హాతో మెడిసిన్ తీసుకుంటున్నాని ప్ర‌కటించారు. అయితే త‌న‌ను ఇటీవ‌ల క‌లిసిన వారు క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష చేసుకోవాల‌ని ప్రిన్స్ మ‌హేష్ బాబు కోరారు. అలాగే ప్ర‌తి ఒక్క‌రూ క‌రోనా వ్యాక్సిన్ తీసుకోవాల‌ని సూచించారు. వ్యాక్సిన్ ల తోనే క‌రోనా వైర‌స్ ను ఎదుర్కోవడం సాధ్యం అవుతుంద‌ని అన్నారు. అలాగే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకుంటే కరోనా సోకినా.. ఆస్ప‌త్రి పాలు కాకుండా ఉంటామ‌ని అన్నారు.