తెలంగాణ లో స్కూళ్లు బంద్.. క్లారిటీ ఇచ్చిన విద్యా శాఖ‌ మంత్రి

-

తెలంగాణ రాష్ట్రం లో కరోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో డిసెంబ‌ర్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తం గా స్కూళ్లు ను మూసివేస్తున్నార‌నే వార్త‌ గ‌త కొద్ది రోజుల నుంచి విన‌ప‌డుతుంది. విద్యార్థుల ఆరోగ్యం పై క‌రోనా ప్ర‌భావం ప‌డుతుంద‌ని స్కూళ్ల ను బంద్ చేస్తున్నార‌ని తెగ ప్రచారం సాగుతుంది. దీని పై తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి స‌బితా ఇంద్రా రెడ్డి స్పందించారు. ఈ వార్త ల‌లో నిజం లేద‌ని విద్యా శాఖ మంత్రి స‌బితా ఇంద్రా రెడ్డి తెలిపారు.

రాష్టంలో పాఠ‌శాల ను మూసివేసే ప్ర‌సక్తే లేద‌ని తెల్చి చెప్పారు. రాష్ట్రం లో అన్ని పాఠ‌శాల‌లో క‌రోనా వైర‌స్ నిబంధ‌నలు పాటిస్తూ పాఠ‌శాల‌ల ను న‌డిపిస్తామ‌ని తెలిపారు. ఈ విష‌యాన్ని ముఖ్య మంత్రి కేసీఆర్ కు స్ప‌ష్టం చేశాడ‌ని తెలిపింది. సోష‌ల్ మీడియా ల‌లో పాఠ‌శాల‌ల కు సెల‌వు లు అని వ‌స్తున్న వార్త ల ను విద్యార్థులు, త‌ల్లి దండ్ర‌లు న‌మ్మ‌వ‌ద్ద‌ని తెలిపారు. అన్ని పాఠ‌శాల‌లో విద్యార్థుల మాస్క్, భౌతిక దూరం పాటించాల‌ని సూచించారు. ప్ర‌యివేటు విద్యాసంస్థ‌లు కూడా కరోనా నిబంధ‌న‌ల ను త‌ప్ప‌క పాటించాల‌ని ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news