ఇవాళ్టి నుంచి వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పంపిణీ.. 60 లక్షల మందికి లబ్ది

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీ.. ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. ఇవాళ తెల్లవారు జాము నుంచే ఇంటి వద్దకే వెళ్ళి లబ్ధిదారులకు పెన్షన్లు అందిస్తున్నారు 2.66 లక్షల మంది వాలంటీర్లు. ఈ వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీ కారణంగా… ఈ నెల మొత్తం 60,50,650 మంది లబ్ధిదారులకు పెన్షన్లు అందించనుంది ఏపీ సర్కార్‌.

jagan
jagan

ఇక ఈ పెన్షన్ల పంపిణీ కోసం రూ.1411.42 కోట్లు విడుదల చేసింది ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం. 5 రోజుల్లోనే నూరు శాతం పెన్షన్ల పంపిణీ జరగాలని ఏపీ సర్కార్‌ స్పష్టం చేసింది. ఆ పెన్షన్ల ప్రక్రియను డిఅర్డీఎ కాల్ సెంటర్ల ద్వారా పర్యవేక్షణ చేయాలని మంత్రి పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఏ ఒక్క లబ్ది దారుడు నష్ట పోకుండా… చూడాలని ఆదేశించారు మంత్రి పెద్ది రెడ్డి. లబ్దిదారుకు పెన్షన్‌ అందజేసే సందర్భంలో గుర్తింపు కోసం బయోమెట్రిక్‌, ఐరిస్‌ విధానాలను అమలు చేస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news