BREAKING : భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక ఉపసంహరించారు అధికారులు. గోదావరి నదికి వరద ప్రవాహం తగ్గుతోంది. భద్రాచలం వద్ద నీటిమట్టం 46 అడుగులకు చేరడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. మరోవైపు దవలేశ్వరం వద్ద 15.87 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో ఉంది. రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోందని, పూర్తిస్థాయిలో వరద తగ్గేవరకు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
ఇది ఇలా ఉండగా, తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ మరియు రేపు భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటన ప్రకారం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడనున్నాయి. ఇక మంగళవారం అదిలాబాద్, అసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలంతు జారీ చేసింది వాతావరణ శాఖ.