స‌చివాల‌య ప‌నులు వేగ‌వంతం.. ద‌స‌రా నాటికి పూర్తి

-

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం కొత్త స‌చివాల‌యాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ప్ర‌స్తుతం స‌చివాల‌య ప‌నులు వేగ వంతం అయినట్టు అధికారులు తెలుపుతున్నారు. ద‌స‌రా నాటికి స‌చివాల‌య నిర్మాణం పూర్తి అయ్యేలా చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్టు తెలిపారు. కాగ గ‌తంలోనే తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్.. స‌చివాల‌య నిర్మాణ ప‌నులు ద‌స‌రా లోపే పూర్తి చేయాల‌ని సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు. కాగ స‌చివాల‌య నిర్మాణం కోసం మొత్తం 1,250 మంది కార్మికులు ప‌ని చేస్తున్నార‌ని వివ‌రించారు.

24 గంట‌ల పాటు.. మూడు షిఫ్ట్ ల్లో ప‌నులు జ‌రుగుతున్నాయ‌ని తెలిపారు. కాగ ప్ర‌స్తుతం స‌చివాల‌యం చివ‌రి అంత‌స్తుకు సంబంధించిన స్లాబ్ ప‌నులు జ‌రుగుతున్నాయ‌ని అధికారులు తెలిపారు. అలాగే నాలుగో అంత‌స్తు వ‌ర‌కు ఇటుక పని, ప్లాస్ట‌రింగ్ పని కూడా పూర్తి అయిన‌ట్టు తెలిపారు. అలాగే స‌చివాల‌య నిర్మాణ ప‌నుల‌ను రాష్ట్ర ర‌హ‌దార్లు, భ‌వ‌నాల శాఖ మంత్రి ప్ర‌శాంత్ రెడ్డి ఎప్ప‌టికప్పుడు ప‌రిశీలిస్తున్నారు. స‌చివాల‌య నిర్మాణానికి రాష్ట్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టికే రూ. 400 కోట్ల నిధుల‌ను విడుద‌ల చేసిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news