బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధిగా గైని నివేదిత ను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. బీఆర్‌ఎస్ పార్టీ ముఖ్యులు స్థానిక నేతలతో చర్చించిన అనంతరం దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతురు నివేదిత ను అభ్యర్థిగా అధినేత ప్రకటించారు.
కాగా… మొదటగా కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న దివంగత ఎమ్మెల్యే సాయన్న మరణించారు. అసెంబ్లీ ఎన్నికలు 2024 కంటే ముందు జరిగింది. ఇక అసెంబ్లీ ఎన్నికలలో కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతురు లాస్య నందిత గెలిచారు. అయితే.. లాస్య నందిత కారు ప్రమాదంలో మరణించారు. ఇక ఇప్పుడు పార్టీ ముఖ్యులు స్థానిక నేతలతో చర్చించిన అనంతరం దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతురు నివేదిత ను ఉప ఎన్నిక అభ్యర్థిగా అధినేత ప్రకటించారు.