టీడీపీ అధినేత చంద్రబాబు తనకు రాజకీయ జీవితాన్ని ఇచ్చారని మంత్రి సీతక్క పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా గండిపేటలో జరిగిన ఎన్టీఆర్ విద్యాసంస్థల వార్షికోత్సవంలో ఆమె పాల్గొన్నారు. ‘ఈ విద్యాసంస్థతో నాకు చాలా అనుబంధం ఉంది.

ఎంతో మంది నిరుపేద బిడ్డలకు చంద్రబాబు సహకారంతో ఉచిత విద్యను అందించాను. ఇది ఈ స్థాయికి ఎదగడం సంతోషంగా ఉంది’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు నారా భువనేశ్వరి పాల్గొన్నారు. కాగా, గతంలో…మంత్రి సీతక్క టీడీపీ పార్టీలో పని చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత.. కాంగ్రెస్ పార్టీలో చేరారు.