ఈనెల 25వ తేదీ నుంచి సంగారెడ్డి వేదికగా సీపీఎం తెలంగాణ రాష్ట్ర మహాసభలు జరుగనున్నాయి. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పీఎస్ఆర్ గ్రౌండ్ లో బహిరంగ సభ జరుగనుంది. ఆదివారం హైదరాబాద్ లోని ఆ పార్టీ ఆఫీస్ లో మహాసభల పోస్టర్ ను పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులుతో కలిసి తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా తమ్మినేని మాట్లాడుతూ రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటుందని ఆరోపించారు.
ఫార్మా, హైడ్రా పేరిట పేదల ఇళ్లను కూల్చుతోందని మండిపడ్డారు. ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామ సభలోనే జరగాలని డిమాండ్ చేశారు. ఒకటి, రెండు మినహా ఇచ్చిన హామీలలో ఏ పథకం కూడా సరిగ్గా అమలు చేయలేదని.. అసహనం వ్యక్తం చేశారు. తాము ప్రభుత్వానికి మిత్రపక్షం కాదని కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ప్రభుత్వానికి మిత్రపక్షం కాదని తెలిపారు. మిత్రపక్షం అయి ఉంటే తాము కూడా కేబినెట్ లో మంత్రి పదవులు తీసుకునే వాళ్లం అని తెలిపారు. ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలపై త్వరలోనే పోరాటం ప్రారంభిస్తామని సంచలన ప్రకటన చేశారు.