పేపర్ లీక్‌లతో యువత భవిష్యత్‌ ప్రశ్నార్ధకం : ఎంపీ దీపీందర్‌ సింగ్‌ హుడా

-

దేశవ్యాప్తంగా ఎక్కడో ఒక చోట ఏదో ఒక ప్రశ్న పత్రం లీక్ అవుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే వైద్య విద్యార్థులు రాసే నీట్ పరీక్ష పేపర్ లీక్ అయిందని దేశ వ్యాప్తంగా వివాదం తలెత్తుతున్న విషయం తెలిసిందే. దేశంలో వరుసగా జరుగుతున్న ప్రశ్నాపత్రాల లీకేజ్‌తో యువత భవిష్యత్‌ నాశనం చేస్తున్నారని కాంగ్రెస్‌ ఎంపీ దీపీందర్‌ సింగ్‌ హుడా ఆందోళన వ్యక్తం చేశారు. హరియాణలో అత్యధికంగా పేపర్‌ లీకేజ్ కేసులు వెలుగుచూశాయని వెల్లడించారు.

నీట్‌ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్  అయితే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ బాధ్యతల నుంచి పారిపోయారని ఎద్దేవా చేశారు. తాము ఈ అంశాన్ని ఇవాళ పార్లమెంట్‌లో చర్చకు లేవనెత్తితే మైక్‌ను స్విచాఫ్‌ చేశారని మండిపడ్డారు. విపక్ష నేత మైక్‌ను నిలిపివేయడంతో విపక్ష ఎంపీలు అసంతృప్తికి లోనై ప్రభుత్వ తీరును తప్పుపట్టారని చెప్పారు. కీలకమైన నీట్‌ అంశంపై సభలో చర్చ జరగాలని తాము పట్టుబట్టామని ఆయన పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

 

Read more RELATED
Recommended to you

Latest news