BREAKING: హైదరాబాద్ లో ఘోర ప్రమాదం..గోడ కూలి ఏడుగురు మృతి

-

Seven people died when the wall collapsed: హైదరాబాద్ మహానగరంలో ఘోర ప్రమాదం జరిగింది. గోడ కూలి ఏకంగా ఏడుగురు మృతి చెందారు. ఈ సంఘటన మంగళవారం రాత్రి హైదరాబాదులో చోటుచేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ లోని బాచుపల్లి లో ఘోర ప్రమాదం జరిగింది. భారీ వర్షాలకు నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్ గోడకూలి ఏకంగా ఏడుగురు కార్మికుల మృతి చెందారు. ఈ మృతులు ఒడిశా, చతిస్గడ్ రాష్ట్రాలకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

Seven people died when the wall collapsed

అలాగే మృతుల్లో ఓ మహిళ, నాలుగు సంవత్సరాల బాలుడు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. కాగా నిన్న రాత్రి నుంచి హైదరాబాద్ మహానగరంలో విపరీతంగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాదులోనే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ వర్షాలు ఉన్నాయి. మరో నాలుగు రోజులపాటు ఇదే పరిస్థితి ఉంటుందని హెచ్చరించింది వాతావరణ శాఖ.

Read more RELATED
Recommended to you

Latest news