ఏపీ తెలంగాణలలో 13 పెళ్ళిళ్ళు..యువకుడు అరెస్ట్

BREAKING : నిత్య పెళ్ళికొడుకు శివ శంకర్ బాబు అరెస్టు.. అయ్యాడు. ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కలిపి 13 మంది యువతులను పెళ్లి చేసుకున్న శివ శంకర్ ను తాజాగా అరెస్ట్ చేశారు పోలీసులు. పెళ్లిళ్లు చేసుకొని శారీరక సుఖాన్ని అనుభవించి డబ్బులు తీసుకొని పారిపోతూ అందరినీ మోసం చేసే వాడు శివ శంకర్ బాబు.

ఈ నేపథ్యంలోనే హైదరాబాద్, రాచకొండ, సంగారెడ్డి, గుంటూరు, విజయవాడ లో శివ శంకర్ బాబు పై కేసులు చేశారు పోలీసులు. ఇటీవల కాలంలో శివ శంకర్ బాబు ను అరెస్ట్ చేయాలంటూ రోడ్డెక్కారు బాధిత మహిళలు.

అమెరికాలో ఉన్న యువతిని సైతం మోసం చేసిన శివ శంకర్ బాబు… డబ్బులు కూడా వసూలు చేశాడు. హైదరాబాద్ చెందిన అమెరికా లో ఉంటున్న యువతి దగ్గర్నుంచి 35 లక్షలు వసూలు చేసిన శివశంకర్… చాలా మందిని రేప్ కూడా చేశాడని సమాచారం. ఇక తాజాగా నిత్య పెళ్ళికొడుకు శివ శంకర్ బాబు అరెస్టు.. అయ్యాడు.