కొడుకును కాపాడబోయిన మాజీ ఎమ్మెల్యే షకీల్ కి షాక్.. కేసు నమోదు

-

రోడ్డు ప్రమాదం కేసు నుంచి కొడుకును తప్పించిన బీఆర్ఎస్ బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ పేరును ఇప్పటికే నమోదై ఉన్న కేసులో పోలీసులు చేర్చారు. ప్రస్తుతం దుబాయ్ లో ఉన్న షకీల్ స్వదేశానికి తిరిగి రాగానే విచారించాలని నిర్ణయించారు. ఇటీవలే షకీల్ కుమారుడు సోహెల్ విపరీతమైన వేగంతో కారు నడుపుతూ తెల్లవారుజామున సమయంలో ప్రజా భవన్ ఎదురుగా ట్రాఫిక్ బారీకేడ్లను ఢీ కొట్టిన విషయం తెలిసిందే. ఆ సమయంలో అక్కడే ఉన్న పంజాగుట్ట ట్రాఫిక్ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. సోహెల్ ను పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లారు.

అయితే కొంత సమయం తరువాత స్టేషన్ కి వచ్చిన షకీల్ అనుచరులు సోహెల్ ను విడిపించుకుని తమ వెంట తీసుకువెళ్లిపోయారు. పోలీసులు షకీల్ ఇంట్లో పని చేస్తున్న అసిఫ్ అనే వ్యక్తి పై కేసులు నమోదు చేశారు. ఇది అంతా తెలియడంతో వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ స్వయంగా రంగంలోకి దిగి విచారణ జరిపారు. సోహెల్ ను ఉద్దేశపూర్వకంగా కేసు నుంచి తప్పించినట్టు నిర్దారణ అయింది. ఈ క్రమంలో డీసీపీ రిపోర్టు ఇవ్వడంతో సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి అప్పట్లో పంజాగుట్ట సీఐ గా ఉన్న దుర్గారావును సస్పెండ్ చేశారు. సోహెల్ పై కేసులు నమోదు చేశారు. తాజాగా ప్రమాదం జరిగిన వెంటనే షకీల్ తన ఇంట్లో పని చేస్తున్న వారితో పాటు పోలీసులకు దుబాయ్ నుంచి ఫోన్లు చేసి మాట్లాడినట్టు నిర్దారణ అయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version