తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం… సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఊహించని షాక్ ఇచ్చింది. జులై మాసంలో 10వ తేదీ గడిచిన కూడా ఇప్పటివరకు… జీతాలు పడలేదని సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్ని సొసైటీలలో ముందుగానే వేతనాలు చెల్లిస్తున్నప్పటికీ… తమ సొసైటీలో మాత్రం ప్రతి నెల ఇదే పరిస్థితి ఉంటోందని వాళ్ళు ఆందోళన చెందుతున్నారు.
సొసైటీ ఉన్నతాధికారుల సత్రం వల్ల ఇదంతా జరుగుతుందని మండిపడుతున్నారు. వేతనాలను ఒక నిర్ణీత ధైర్యం లేకుండా ప్రతినెల ఏదో ఒక తేదీన వేస్తున్నారని… దాని ఫలితంగా సిబిల్ స్కోర్ పై ప్రభావం ఉంటుందని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి జీతాలను విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇక దీనిపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా సీరియస్ అయ్యారు.