తెలంగాణ ఉద్యోగులకు షాక్… సోమవారం సెలవు రద్దు ?

-

తెలంగాణ ఉద్యోగులకు షాక్… దీపావళి పండుగ సందర్భంగా సోమవారం సెలవు రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల నామినేషన్లను సోమవారం పరిశీలించాల్సి ఉన్న నేపథ్యంలో ఆ రోజున సెలవు ఇస్తే సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.

సెలవు ఇస్తే ఎన్నికల షెడ్యూల్ ను ఒకరోజు ముందుకు మార్చాల్సి ఉంటుందని సీఈవో కార్యాలయం ప్రభుత్వానికి బదులిచ్చినట్లు తెలుస్తోంది. దీంతో సెలవుపై ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా దీపావళి పండుగ సందడి మొదలైంది. పండుగ వేళ రెండు తెలుగు రాష్ట్రాలలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. మొదట ఏపీలోని విద్యాసంస్థలకు మూడు రోజులు సెలవులు ప్రకటించారు. ఇక నిన్న తెలంగాణలోని విద్యాసంస్థలకు కూడా మూడు రోజులపాటు సెలవులు ఉండనున్నట్లు వెల్లడించారు.షెడ్యూల్ ప్రకారం ఆదివారం రోజున అంటే 12వ తేదీన దీపావళి సెలవు ఉండగా.. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు దాన్ని సోమవారానికి మార్చేశాయి. దీంతో ఇవాళ రెండో శనివారం, రేపు ఆదివారం కలిసి వచ్చాయి.

Read more RELATED
Recommended to you

Latest news