చతుర్ముఖ వ్యూహం..!

-

తెలంగాణలో ఈసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలని బిఆర్ఎస్ విశ్వప్రయత్నాలు చేస్తుంది. గెలుపు కోసం ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకుండా తమకు అనుకూలంగా మార్చుకుంటుంది. బిఆర్ఎస్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవడానికి దాదాపు మూడు నెలలు ముందుగానే అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించి, ప్రచారానికి తెరలిపిందని చెప్పవచ్చు. ఆ జాబితా నుంచి నిరసనలు వెల్లువెత్తినా వాటిని సముదాయిస్తూ, అసంతృప్తులను బుజ్జగిస్తూ వారిని నచ్చచెప్పి పార్టీ గెలుపు కోసం వారితో పని చేయించుకోవడం మొదలుపెట్టారు బిఆర్ఎస్ అధిష్టానం. అంతేకాకుండా పక్క పార్టీల నుంచి బిఆర్ఎస్ వైపు చూస్తున్న నేతలను కూడా కారేక్కించుకొని తమ గెలుపుకు మార్గం సుగమం చేసుకుంటున్నారు.

బిఆర్ఎస్ పార్టీకి మూల స్తంభాల లాంటి నలుగురు నేతలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కల్వకుంట్ల కవిత ఈ నలుగురితోటే ఎన్నికల ప్రచారాన్ని ముందుకు నడిపిస్తోంది బిఆర్ఎస్. రాష్ట్రం మొత్తం మీద బహిరంగ సభలు, రోడ్ షోలు, ఇంటింటికి ప్రచారం అంటూ వినూత్న వ్యూహాలకు బిఆర్ఎస్ తెరలేపిందని చెప్పవచ్చు.

కేసిఆర్ ప్రతిరోజు ఒక బహిరంగ సభలో పాల్గొంటూ తెలంగాణకు బిఆర్ఎస్ ను గెలిపించవలసిన ఆవశ్యకతను ప్రజలకు చెబుతూ ఉన్నారు. హరీష్ రావు, కేటీఆర్ గ్రామాలలో రోడ్ షోలు నిర్వహిస్తూ బిఆర్ఎస్ గెలుపుకు కావలసిన ప్రచారాన్ని అందిస్తున్నారు. కేటీఆర్ పగలంతా నియోజకవర్గాల్లోనూ, గ్రామాల్లోనూ తిరుగుతూ రాత్రి గ్రేటర్ హైదరాబాద్ లో రోడ్ షోలు నిర్వహిస్తూ తమ పార్టీని గెలిపిస్తేనే తెలంగాణకు అభివృద్ధి అంటూ చెబుతూ ప్రచారం చేస్తున్నారు. ఎమ్మెల్సీ కవిత సుడిగాలి పర్యటనతో నియోజకవర్గాలన్నీ చుట్టి వస్తున్నారని చెప్పవచ్చు. నిజామాబాద్ బోధన్ సెగ్మెంట్లకు ఇన్చార్జిగా ఉన్న కవిత ఆ నియోజకవర్గాలలో గెలుపు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. టిఆర్ఎస్ లో మరి ఏ ఇతర సీనియర్ నాయకుడి సహాయం లేకుండానే బిఆర్ఎస్ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తుందని చెప్పవచ్చు.

చతుర్ముఖ వ్యూహంతో ముందుకు వెళుతున్న బిఆర్ఎస్ ఈసారి హ్యాట్రిక్ కొడుతుందా???? లేదా? అనేది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news