తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో భద్రాచలం ఒకటి. భద్రాచలంలో ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించుకోవడానికి ప్రతి రోజు వెల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. తాజా గా రేపటి నుంచి భద్రాచలంలో శ్రీ రామ నవమి తిరు కల్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆలయ ఈవో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయలంలో ఇప్పటి వరకు ఉన్న అన్ని టికెట్ల దరలను భారీగా పెంచేశారు. దీంతో ఇప్పటి వరకు రూ. 20 ఉన్న లడ్డూ ధర రూ. 25కి పెరిగింది. పులిహోరా ధర రూ. 10 నుంచి రూ. 15కు పెరిగింది.
చక్కెర పొంగిలి ధర రూ. 10 నుంచి రూ. 15 కి పెరిగింది. అలాగే కేశ ఖండన టికెట్ ధర రూ. 15 నుంచి రూ. 20కి పెంచారు. దీంతో శ్రీ రామ నవమి ఉత్సవాల సందర్భంగా మరి కొన్ని టికెట్ల ధరలను కూడా పెంచారు. కల్యాణాన్ని తిలకించే ఉభయదాల టికెట్ ధర రూ. 5,000 నుంచి రూ. 7,500 కు పెంచారు. దీంతో పాటు ఇతర సెక్టార్ లలో రూ. 2,000 ఉన్న టికెట్ ధర ను రూ. 2,500 కు పెంచారు.
రూ. 1,116 ఉన్న టికెట్ ధర రూ. 2,000 కి పెరిగింది. అలాగే రూ. 500 ఉన్న టికెట్ ధర రూ. 1,000 కి పెరిగింది. రూ. 200 టికెట్ రూ. 300 కు పెంచారు. దీంతో పాటు 11వ తేదీన జరిగే మహా పట్టాభిషేకం రోజున ఉండే ఉభయదాతల టికెట్ ధర ను రూ. 250 నుంచి ఏకంగా రూ. 1,000 కి పెంచారు.