బంగారం, వెండి కొనుగోలు దారులకు బిగ్ ఊరట. నేడు కూడా బంగారం, వెండి ధరలను పెరగలేదు. బంగారం ధరలు తెలుగు రాష్ట్రాల్లో నేడు ఎలాంటి మార్పులు చోటు చేసుకోకుండా.. నిలకడగా ఉన్నాయి. అలాగే వెండి ధరలు ఈ రోజు.. గుడ్ న్యూస్ చెప్పాయి. ఈ రోజు వెండి ధరలు భారీగా తగ్గాయి. ఈ రోజు కిలో గ్రాము వెండిపై రూ. 800 వరకు తగ్గింది. అయితే మార్చి 26 వ తేదీ నుంచి బంగారం, వెండి ధరలు పెరగకుండా.. తగ్గుతూ వస్తున్నాయి.
దాదాపు వారం రోజుల నుంచి బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ఉక్రెయిన్ – రష్యా యుద్ధ ప్రభావంతో భారీ గా పెరిగిన బంగారం, వెండి ధరలు ఇప్పుడు కాస్త తగ్గుతున్నాయి. కాగ ఈ రోజు మార్పులు చోటు చేసుకున్న దాని ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబద్, విజయవాడ నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్, విజయవాడ నగరాల్లో 10 గ్రాముల… 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,650 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,980 గా ఉంది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 71,300 గా ఉంది.