పెరుగుతున్న కరెంటు వినియోగం.. థర్మల్‌ విద్యుత్కేంద్రాల్లో బొగ్గు కొరత తీవ్రం

-

దేశవ్యాప్తంగా విద్యుత్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. భారత్లో ఉన్న 22 థర్మల్‌ విద్యుత్కేంద్రాల్లో తీవ్ర బొగ్గు కొరత నెలకొనడంతో పూర్తి స్థాయిలో విద్యుదుత్పత్తి కావడం లేదు. మరోవైపు రోజువారీ విద్యుత్‌ వినియోగం భారీగా పెరుగుతుండటంతో థర్మల్‌ విద్యుత్కేంద్రాల్లో ఉత్పత్తి పెంచాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం తాజాగా సూచనలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా 2.09 లక్షల మెగావాట్ల స్థాపిత ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ఈ విద్యుత్కేంద్రాల్లో పూర్తిస్థాయిలో ఉత్పత్తి జరగాలంటే.. వాటిలో ఎప్పుడూ 6.86 కోట్ల టన్నుల బొగ్గు నిల్వలుండాలి.

ఈ నెల 8 నాటికి అందులో 68 శాతమే అంటే 4.65 కోట్ల టన్నుల బొగ్గు మాత్రమే ఉన్నట్లు కేంద్ర విద్యుత్‌ మండలి(సీఈఏ) తెలిపింది. తెలంగాణలోని థర్మల్‌ విద్యుత్కేంద్రాల్లో ముందస్తు నిల్వల కోటా 16.34 లక్షల టన్నులు ఉండాల్సి ఉండగా.. 8.61 లక్షల టన్నులే (53 శాతం) ఉన్నట్లు తెలిపింది. అన్ని చోట్ల కనీస ఉత్పత్తి జరిగేందుకు వీలుగా ప్రతి విద్యుత్కేంద్రంలో వినియోగించే బొగ్గులో 6 శాతం వచ్చే జూన్‌ వరకూ విదేశాల నుంచి తప్పనిసరిగా దిగుమతి చేసుకోవాలంటూ కేంద్ర విద్యుత్‌శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news