ప్రతిపక్షాలకు దడపుట్టేలా నాలుగో సిద్ధం సభ సక్సెస్.. 15 లక్షల పైచిలుకు అభిమానులు హాజరు..

-

సిద్ధం.. ఈ పేరు రాష్ట్రంలో సంచలనాలకు కేరాఫ్ గా నిలుస్తోంది.. చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నాలుగు సభలకు అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.. తండోపతండాలుగా సీఎం జగన్ ప్రసంగాన్ని వినేందుకు.. ఆరాధ్య నాయకున్ని చూసేందుకు తరలివచ్చారు.. రాష్ట్రంలో జరిగిన మూడు సభలో ఎత్తైతే.. అద్దంకి వేదికగా మేధరమెట్లలో జరిగిన సభ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లెక్కించిందని రాజకీయ పండితులు చెబుతున్నారు.. రాజకీయ సభలు అంటే వెళ్లేందుకు ఎవరూ పెద్దగా ఆసక్తి చూపరు.. కానీ జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న సిద్ధం సభలకు మాత్రం తగ్గేదెలా అన్నట్లు అభిమానులు వైఎస్ఆర్సిపి శ్రేణులు హాజరవుతున్నారు..

అద్దంకి వేదికగా మేదరమెట్టల్లో జరిగిన సిద్ధం నాలుగో సభకు సుమారు 15 లక్షల పైచిలుకు అభిమానులు హాజరయ్యారని ఇంటలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి.. సభా ప్రాంగణంలో ఎంతమంది అభిమానులు ఉన్నారో.. సభ బయట రోడ్డు మీద అంతకు మించి క్యాడర్ హాజరైందని.. ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రభుత్వానికి తెలిపాయట.. రాప్తాడు సభలో 10 లక్షల మంది అభిమానులు హాజరయ్యారని పార్టీ వర్గాలు చెప్పగా.. అద్దంకి సభను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.. 15 లక్షల మంది రానున్నట్లు ముందుగానే ప్రకటించి భారీ ఏర్పాట్లు చేశారు.. 44 నియోజకవర్గాలకు చెందిన కార్యకర్తలు వైఎస్ఆర్సిపి అభిమానులు భారీగా హాజరవడంతో.. మేదరమెట్ల హైవే కిక్కిరిసి కనిపించింది.. ఒక నాయకుడు పై ఇంత అభిమానం ఉంటుందా అన్న స్థాయిలో జాతీయస్థాయి మీడియా ఛానల్లో సైతం పోటీపడి ప్రసారం చేశాయి.

ఉదయం 10 గంటల నుంచి వేల వాహనాలన్నీ మేదరమెట్ల వైపు వచ్చాయి.. వాహనాల పార్కింగ్ అవసరమైన స్థలాన్ని హైవే పక్కనే అధికారులు ఏర్పాటు చేయడంతో వేల వాహనాలకు పార్కింగ్ స్థలం సరిపోకపోవడంతో.. రోడ్లపైనే వాహనాలు ఆగిపోయిన పరిస్థితి కనిపించిందట. నాలుగు సిద్ధం సభలతో వచ్చిన హైపును.. ఎన్నికల సంగ్రామంలోకి దిగాలని సీఎం జగన్ భావిస్తున్నారట.. నాలుగు సిద్ధం సభలకు వచ్చిన జనాభాన్ని చూసిన రాజకీయ పండితులు సైతం.. మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రపంచం ఖాయమనే విశ్లేషణలు చేస్తున్నారట.. ఇంత పెద్ద భారీ సభలను తాము ఎప్పుడూ చూడలేదని.. ఒక్క నాయకుడికి ఇన్ని కోట్ల మంది అభిమానులు ఉన్నారా అనే ఆశ్చర్యం కలుగుతుందని రాజకీయ పండితులు చెబుతున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news