SI Sriramula Srinu of Bhadradri district Ashwaraopet passed away: తెలంగాణలో విషాదం చోటు చేసుకుంది. ఆత్మహత్యకు పాల్పడ్డ SI మృతి చెందాడు. భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట SI శ్రీరాముల శ్రీను మృతి చెందారు. జూన్ 30న మహబూబాబాద్ లో ఆయన పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు.
అప్పటినుంచి హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు కన్ను మూశారు. తన భర్త ఆత్మహత్యకు CI జితేందర్ రెడ్డి, కానిస్టేబుళ్లు సన్యాసి నాయుడు, సుభాని, శేఖర్, శివ నాగరాజు కారణమని భార్య ఇచ్చిన ఫిర్యాదుతో వారిపై అట్రాసిటీ కేసు నమోదు అయింది. మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.