బంగారంతో సమానమైన ఏ వస్తువులను అక్షయ తృతీయ రోజున కొనుగోలు చేయవచ్చు?

-

సహజంగా ప్రతి ఒక్కరూ అక్షయ తృతీయకు బంగారాన్ని కొంటూ ఉంటారు. పైగా అక్షయ తృతీయ రోజున బంగారం షాపులు చాలా రద్దీగా ఉంటాయి. ఈ రోజున బంగారాన్ని కొనుగోలు చేస్తే, లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందవచ్చని అందరూ భావిస్తారు. అయితే, ఈ మధ్యకాలంలో బంగారం ధర చాలా పెరిగింది. ముఖ్యంగా మధ్య తరగతి వారు బంగారాన్ని కొనాలంటే ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఆర్థిక పరిస్థితి దృఢంగా లేనప్పుడు, బంగారాన్ని కొనడానికి అనేక ఆలోచనలు చేస్తారు. అక్షయ తృతీయ రోజున కేవలం బంగారాన్ని మాత్రమే కాదు, మరెన్నో వస్తువులను కూడా కొనుగోలు చేయవచ్చు. మంచి ఫలితాలను పొందాలంటే, బంగారంతో సమానమైన ఈ వస్తువులను కూడా కొనవచ్చని పండితులు చెబుతున్నారు.

ప్రతి సంవత్సరం వైశాఖమాసంలో శుక్లపక్షం మూడవ రోజున అక్షయ తృతీయను జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఏప్రిల్ ౩౦వ తేదీన అక్షయ తృతీయ రావడం జరిగింది. ఈ రోజున ఎలాంటి మంచి కార్యక్రమాలు చేసినా మంచి ఫలితాలను పొందవచ్చు. ప్రతి నెలలో శుక్లపక్ష తృతీయ కూడా చాలా మంచి రోజు అని పండితులు చెబుతారు. అక్షయ తృతీయ రోజున బంగారం బదులుగా వెండి వస్తువులను కొనుగోలు చేయవచ్చు. అక్షయ తృతీయ రోజున, పత్తిని కూడా కొనవచ్చు. పూజలో భాగంగా, పత్తితో తయారుచేసిన వత్తిని ఉపయోగిస్తారు. ఈ పత్తిని ఉపయోగించి లక్ష్మీదేవికి పూజ చేస్తే మంచి జరుగుతుంది.

అంతేకాకుండా, కొత్త బట్టలను ఈ రోజున వేసుకోవడం వలన అదృష్టాన్ని పెంచుకోవచ్చు.
రాగి, ఇత్తడి పాత్రలను కూడా ఈ పండుగకు కొనవచ్చు. వీటిని కొనడం వల్ల సౌభాగ్యం మరింత పెరుగుతుందని పండితులు చెబుతారు. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలంటే, అక్షయ తృతీయ రోజున గవ్వలను కొనడం ఎంతో అవసరం. తృతీయ రోజున 11 గవ్వలను కొని, ఎర్రటి వస్త్రంలో చుట్టి లక్ష్మీదేవి దగ్గర పెట్టాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో సంపద మరింత పెరుగుతుంది. మట్టికుండలను కూడా అక్షయ తృతీయ రోజున కొనుగోలు చేయవచ్చు. వీటిని ఇంటికి తీసుకురావడం వలన సంపదను పెంచుకోవచ్చు. బంగారం కొనలేని సమయంలో, మట్టికుండలు బంగారంతో సమానం అని హిందూ పురాణాలు చెబుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news