TSPSC కార్యాలయంలో​ పరిస్థితులు చూసి సిట్​ అధికారులు షాక్

-

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో టీఎస్పీఎస్సీ కార్యాలయాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. అవసరమైతే సంబంధిత అధికారులను ప్రశ్నించాలని భావిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా చేసినా, యాదృశ్చికంగా జరిగినా తప్పు జరిగింది కాబట్టి దానికి కారణమైన ప్రతి ఒక్కర్నీ ప్రశ్నించాల్సిందే అని  అధికారులు భావిస్తున్నారు.

ఈ క్రమంలో టీఎస్పీఎస్సీ కార్యాలయాలన్ని పరిశీలించిన సిట్ అధికారులు అక్కడి పరిస్థితులు చూసి షాక్ అయ్యారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన ఈ రోజుల్లో.. ప్రశ్నాపత్రాలు బయటకు లీక్ కాకుండా అనేక చర్యలు తీసుకోవాలి. కానీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయంలో ఇలాంటివేవీ కనిపించ లేదని దర్యాప్తులో తేలినట్లు తెలిపారు.

‘ప్రశ్నాపత్రాలను కాన్ఫిడెన్షియల్ సెక్షన్‌లోని కంప్యూటర్​లో భద్రపరుస్తారు. సెక్షన్ ఇన్​ఛార్జీ తప్ప ఇతరులు తెరిచే అవకాశం లేకుండా డిజిటల్ లాక్ వేస్తారు. ఒకవేళ ఎవరైనా తెరవాలని ప్రయత్నిస్తే వెంటనే సంబంధిత ఇంఛార్జీకి ఎస్​ఎమ్​ఎస్​ అలర్ట్‌ వస్తుంది. ఇక్కడ కూడా ఈ విధానం ఉందని, కానీ ప్రశ్నాపత్రాలపై కన్నేసిన రాజశేఖర్‌రెడ్డి ద్వయం.. దాదాపు సంవత్సరం క్రితం నెట్‌వర్క్‌ అప్‌డేషన్ జరిగినప్పుడే ఈ అలర్ట్‌ విధానం నిర్వీర్యం చేసినట్లు సమాచారం. డైనమిక్ ఐపీని స్టాటిక్ ఐపీగా మార్చారు. కానీ నెలలు గడిచినా ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యే వరకూ దీన్ని కమిషన్ కార్యాలయంలో ఎవరూ గుర్తించలేకపోవడం గమనార్హం.’ అని సిట్ అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news