కేటీఆర్ వ్యాఖ్యలపై సీతక్క స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.తెలంగాణలో ఇటీవల ఎన్నికల్లో గెలిచి నూతన ప్రభుత్వా న్ని ఏర్పరిచిన కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ పలు విమర్శలు చేశాడు. సాధ్యం కానీ హామీలతో ప్రభుత్వాన్ని ఎలా నడుపుతారు చూస్తామని అన్నాడు. కేవలం ఎన్నికల్లో విజయం సాధించడానికి మాత్రమే వారు హామీలు ఇచ్చాడని అన్నాడు. అలాగే రెండు లక్షల రుణమాఫీని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే చేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించాడు.
బుధవారం మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ వ్యాఖ్యలపై గిరిజన శాఖ మంత్రి సీతక్క ఘాటుగా స్పందించింది. అంత తొందరపాటు బిఆర్ఎస్ నాయకులకు ఉండకూడదని అధికారం దక్కకపోవడంతోనే వారు ఇలా మాట్లాడు తున్నారు అని తెలిపింది. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటాము అని సీతక్క అన్నది. తాము ఇచ్చిన హామీలకు ఇంకొన్ని పథకాలను జోడించి వారు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం తప్పక అమలు చేస్తుందని తెలిపింది. ఇప్పటికే చాలామంది ప్రజలు తమ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నారని పేర్కొంది.