అతివేగం కొంపముంచింది.. ఇద్దరు డెడ్…!

-

అతివేగమే కొంపముంచింది. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు ఈ సంఘటన సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళితే పూసగూడెం పంచాయతీ ఒడ్డు రామవరం గ్రామానికి చెందిన వంశీ, విష్ణు ఇద్దరు యువకులు ఆదివారం ఇదే మండలంలోని రాజాపురం ముత్యాలంపాడు గ్రామాల్లో బంధువులు ఇంటికి ఫంక్షన్ కి వెళ్లడం జరిగింది. ఇక్కడే అర్ధరాత్రి దాకా స్థానిక యువకులతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

సోమవారం తెల్లవారుజామున ఇంటికి బయలుదేరారు కంప గూడెం క్రాస్ రోడ్ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది పోలీసులకి సమాచారాన్ని ఇచ్చారు స్థానిక ఎస్సై రాజమౌళి సిబ్బందితో వెళ్లి చూస్తే అప్పటికే యువకులు మృతి చెందినట్లు నిర్ధారించారు పల్సర్ బైక్ మితిమీరిన వేగంతో నడిపినట్లు తెలుస్తోంది వేగమే కొంపముంచిందని అర్థమవుతుంది స్థానిక ఎస్సై కేసు నమోదు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version