దారుణం.. పెద్దపల్లి జిల్లాలో ఆరేళ్ల బాలికపై హత్యాచారం

-

పెద్దపల్లి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఓ కీచకుడు అనంతరం ఆ చిన్నారని హత్య చేసి చంపాడు. హత్య చేసిన అనంతరం అతను బాలిక శవాన్ని తన భుజంపై మోసుకెళ్తున్న దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని ఓ రైస్​ మిల్లులో పని చేసే డ్రైవర్ బలరామ్ గురువారం రాత్రి ఆ మిల్లులో తల్లితో పాటు నిద్రిస్తున్న బాలికను సమీప పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి చంపేశాడు. అర్ధరాత్రి సమయంలో బాలిక లేదని గుర్తించిన తల్లి, తోటి కార్మికులను నిద్రలేపి విషయం చెప్పింది. వారంతా బాలిక కోసం పరిసరాల్లో వెతికగా ఎక్కడా ఆచూకీ కనిపించలేదు. అనంతరం మిల్లులోని సీసీటీవీని పరిశీలించగా బలరామ్ ఆ బాలికను ఎత్తుకెళ్లిన విజువల్స్ కనిపించాయి. ఈ ఘటనలో నిందితుడిని గుర్తించిన కార్మికులు పోలీసులకు అప్పగించారు. బాలిక మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news