అలర్ట్.. టీఆర్‌టీ సిలబస్‌లో స్వల్ప మార్పు

-

ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్‌టీ) అభ్యర్థులకు అలర్ట్. టీఆర్టీ సిలబస్​లో స్వల్ప మార్పులు జరిగాయి. జాతీయ నూతన విద్యా విధానంలో భాగంగా పాఠశాల విద్య కోసం కేంద్ర విద్యాశాఖ రూపొందించిన కొత్త కరిక్యులమ్‌ను టీఆర్టీలో చేర్చారు. అంటే దానిపై కూడా ప్రశ్నలు అడగనున్నారు.

ఆగస్టు 23న నేషనల్‌ కరిక్యులమ్‌ ఫ్రేమ్‌ వర్క్‌ ఫర్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌-2023 (ఎన్‌సీఎఫ్‌ఎస్‌ఈ) పేరిట తయారు చేసిన నివేదికను కేంద్ర సర్కార్ విడుదల చేసింది. ఈ కరిక్యులమ్​తో పాటు టీఆర్‌టీ సిలబస్‌లో చేర్చడంతో పాటు ఎన్‌సీఎఫ్‌-2005, ఎన్‌సీఎఫ్‌టీఈ -2009లనూ చేర్చారు.

అయితే దీనిపై తెలంగాణ వైఖరి ఏమిటో ఇప్పటికీ క్లారిటీ రాలేదు కానీ.. అదే సిలబస్‌ను టీఆర్‌టీలో తాజాగా చేర్చడంతో రాష్ట్రంలో అమలు చేస్తున్నట్లేనా అన్న సందేహాన్ని పలువురు వెలిబుచ్చుతున్నారు.
మరోవైపు టీఆర్‌టీలో సైకాలజీ భాగాన్ని కూడా చేర్చారు. టెట్‌ ప్రవేశ పెట్టక ముందు(2011) డీఎస్సీలో పిల్లల సైకాలజీపై ప్రశ్నలు అడిగేవారు. ఇటీవల నిర్వహించిన టెట్‌లోనూ దీనిపై ప్రశ్నలు రావడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news