తెలంగాణ‌లో స్వ‌ల్పంగా పెరిగిన కరోనా.. నేడు 67 కేసులు

-

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసుల సంఖ్య స్వ‌ల్పంగా పెరిగింది. శుక్ర‌వారంతో పోలిస్తే.. దాదాపు 15 క‌రోనా పాజిటివ్ కేసులు పెరిగాయి. కాగ నేటి కరోనా వైర‌స్ బులిటెన్ ను తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కాసేప‌టి క్రితం విడుద‌ల చేశారు. ఈ కరోనా బులిటెన్ ప్రకారం.. గ‌డిచిన 24 గంట‌ల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 67 క‌రోనా వైరస్ పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. కాగ శుక్ర‌వారం రాష్ట్రంలో కేవ‌లం 52 క‌రోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి.

అంటే.. నిన్న‌టితో పోలిస్తే.. ఈ రోజు క‌రోనా కేసుల సంఖ్య‌.. 15 పెరిగాయి. కాగ ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 92 మంది క‌రోనా వైర‌స్ బాధితులు పూర్తిగా కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ యాక్టివ్ కేసుల సంఖ్య 713 కు తగ్గింది. కాగ ఈ రోజు కూడా తెలంగాణ రాష్ట్రంలో కరోనా మ‌ర‌ణాలు వెలుగు చూడ‌లేదు. అలాగే గ‌డిచిన 24 గంట‌ల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు 20,496 క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్షలు నిర్వ‌హించారు.

Read more RELATED
Recommended to you

Latest news