మాజీ ఐఏఎస్ బాలలతకు స్మితా కౌంటర్ ఇచ్చారు. తనతో పాటు స్మిత సివిల్స్ పరీక్షలు రాసి ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని నిన్న స్మితాకు సవాల్ విసిరారు బాలలత. అయితే…మాజీ ఐఏఎస్ బాలలతకు స్మితా కౌంటర్ ఇచ్చారు. సివిల్స్ పరీక్షలు రాసేందుకు సిద్ధమే కానీ వయస్సు పెరిగిన దృష్ట్యా uppsc అనుమతించదేమో అని స్మితా ట్విట్ చేశారు.
దివ్యంగుల కోటాలో బాలలత తన ప్రత్యేక హక్కును దేనికి ఉపయోగించింది? కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లను నడపడానికా? ఫీల్డ్ వర్క్ ద్వారా ప్రజలకు సేవ చేయడానికా ? అంటూ ఓ నెటీజన్ ను ప్రశ్నించారు స్మితా సబర్వాల్.
కాగా, దివ్యాంగులపై ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ చేసిన కామెంట్స్‌కు మాజీ బ్యూరోక్రాట్, ఐఏఎస్ కోచింగ్ సంస్థ నిర్వాహకురాలు బాలలత కౌంటర్ ఇచ్చారు. తనతో సివిల్స్ పరీక్షకు రాయడానికి స్మిత సిద్ధమా అంటూ సవాల్ విసిరారు బాలలత. స్మిత సబర్వాల్ గుర్తింపు కోసమే మాట్లాడుతోంది. ఆమె మాటలు దురదృష్టకరం అన్నారు. అసలు దివ్యాంగులం బ్రతకాలా వద్దా? మమ్మల్ని రాష్ట్రంలో ఉండమంటారా? వద్దా? పని ఉన్నోళ్ళు పని చేస్తారు. ట్వీట్ లు పెడుతూ ఉండరు. స్మిత సబర్వాల్ ఫిజికల్ గా ఫిట్ గా ఉన్నారేమో కానీ మెంటల్ గా ఫిట్ గా లేదు. అసలు స్మిత సబర్వాల్ అర్హత ఎంటి? స్మిత మాట్లాడిన మాటలు ఆమె వ్యక్తిగతమా? తెలంగాణ ప్రభుత్వ విధానమా? స్మిత తన సర్వీసులో ఎన్ని రోజులు ఫీల్డ్ వర్క్ లో పరుగెత్తుతూ పని చేసిందో చెప్పాలన్నారు.