తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అదిరిపోయే శుభవార్త అందింది. జూన్ రెండో వారంలో నైరుతి రుతుపవనాలు తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటన చేసింది. ఈ మేరకు ఓ ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసింది వాతావరణ శాఖ.
మరోవైపు రానున్న మూడు రోజులు పాటు తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ భారీ ఉంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ వర్షాలతో రైతులు తొందరపడి విత్తనాలు నాటుకోవద్దని కూడా సూచనలు చేసింది. భూమిలో ఉన్న వేడి తగ్గిన తర్వాత విత్తనాలు వేస్తే మంచిదని స్పష్టం చేసింది. ఇక అటు ఏపీలో మరో రెండ్రోజుల పాటు ఎండల తీవ్రత ఉండనుంది. నేడు 15 మండలాలు, రేపు 302 మండలాల్లో వడగాలులు ఉండనున్నట్లు ఏపీ వాతావరణ శాఖ పేర్కొంది.