నేడు YSR పెన్షన్‌ కానుక పంపిణీ.. 63.14 లక్షల మంది లబ్ధి

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలకు అదిరిపోయే శుభవార్త చెప్పింది జగన్‌ సర్కార్‌. నేడు ఏపీలో వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పంపిణీ చేయనుంది జగన్‌ సర్కార్‌. ఇందులో భాగంగా.. 63.14 లక్షల మంది లబ్ధిదారులకు రూ.1739.75 కోట్లు విడుదల చేయనుంది ప్రభుత్వం.

వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పెన్షన్ల పంపిణీ చేయనుంది. ఈ మేరకు ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇతర ప్రాంతాల్లో ఉన్న వారు కూడా… సొంత గ్రామాలకు వచ్చి.. వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పంపిణీ తీసుకోవాలని ఏపీ సర్కార్‌ కోరింది. కాగా, నేడు కర్నూలు జిల్లా పత్తికొండలో సీఎం జగన్ పర్యటించనున్నారు.

ఈ సందర్భంగా వైయస్సార్ రైతు భరోసా సాయాన్ని సీఎం జగన్‌ రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు.2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి విడత పెట్టుబడి సాయంగా 52.31 లక్షల మందికి రూ. 7,500 చొప్పున రూ. 3,934 కోట్లను బటన్ నొక్కి ఖాతాల్లో జమ చేస్తారు. అలాగే మార్చి, ఏప్రిల్, మే నెలలో కురిసిన అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు రూ. 46.39 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీ అందించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news