డ్రగ్స్ కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులు : సీఎం రేవంత్ రెడ్డి

-

డ్రగ్స్ కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులు తీసుకొస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. SDRF ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. రాజకీయ ఒత్తిడి, పైరవీలకు తావు లేకుండా పాలన అందిస్తున్నట్టు వెల్లడించారు. ఎలాంటీ పైరవీలు లేకుండా పోలీసులకు పదోన్నతులు, బదిలీలు చేపట్టామన్నారు. పోలీస్, అగ్నిమాపక శాఖలో 15వేల మందికి నియామక పత్రాలు అందించామని తెలిపారు. పీజీలు, పీహెచ్డీలు చేసిన వారు కూడా కానిస్టేబుల్ ఉద్యోగాలకు వస్తున్నారని తెలిపారు.

డ్రగ్స్ రూపంలో కొత్త నేరాలు పుట్టుకొస్తున్నాయని.. గంజాయి, కొకైన్, హెరాయిన్ మన రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నాయి. యువతకు సైబర్ క్రైమ్ విభాగంలో శిక్షణ ఇవ్వాలని డీజీపీని కోరుతున్నట్టు తెలిపారు. డ్రగ్స్ రవాణాదారులు తెలంగాణకు రావాలంటేనే భయపడాలన్నారు. డ్రగ్స్ విష వలయం గురించి పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కల్పించాలని సూచించారు. పిల్లల భవిష్యత్ గురించి పాఠశాల యాజమాన్యాలకు బాధ్యత ఉండాలన్నారు. డ్రగ్స్ కేసులకు సంబంధించి ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి 6 నెలలలోపు తీర్పులు వచ్చేవిధంగా చూస్తామని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news