మండల, జిల్లా పరిషత్ l లో ప్రత్యేక అధికారుల పాలన!

-

తెలంగాణలో ఇప్పటికే గ్రామస్థాయిలో సర్పంచ్ల స్థానంలో ప్రత్యేకాధికారుల పాలన నడుస్తున్న విషయం తెలిసిందే. ఇక నుంచి మండల, జిల్లా పరిషత్తుల్లో ప్రత్యేకాధికారుల పాలనకు రంగం సిద్ధమైనట్లు తెలిసింది. ఎంపీపీలు, జడ్పీ ఛైర్‌పర్సన్ల పదవీకాలం ఈనెల 3, 4 తేదీల్లో ముగియనుండటంతో జడ్పీలకు జిల్లా కలెక్టర్లను, మండల పరిషత్‌లకు జిల్లా స్థాయి అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమిస్తూ ప్రభుత్వం ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు సమాచారం.

బీసీ రిజర్వేషన్ల అంశంతో ముడిపడి ఉన్నందున ఇప్పటికే పంచాయతీ ఎన్నికలను వాయిదా వేసిన ప్రభుత్వం తాజాగా జడ్పీటీసీ, ఎంపీటీసీ, జడ్పీ ఛైర్‌పర్సన్లు, ఎంపీపీ ఎన్నికలను వాయిదా వేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ జాబితా సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించింది. ప్రభుత్వ ఆమోదం తర్వాత ఉత్తర్వులు జారీ అవుతాయి. మండల పరిషత్‌లకు ఈనెల నాలుగో తేదీ నుంచి జిల్లా స్థాయి అధికారులు నియమితులవనున్నట్లు సమాచారం. ఐదో తేదీన 28 జిల్లా పరిషత్‌లకు జిల్లా కలెక్టర్లు ప్రత్యేకాధికారులుగా బాధ్యతలు స్వీకరిస్తారు. ఆగస్టుతో బీసీ కమిషన్‌ పాలకమండలి గడువు ముగిశాక.. కొత్త పాలక మండలి నియామకం చేపట్టి…కులగణన నిర్వహించనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news