కంచె గచ్చిబౌలి వివాదం పై శ్రీధర్ బాబు క్లారిటీ

-

అభివృద్ధిని అడ్డుకోవాలన్నదే ప్రతిపక్షాల కుట్ర అని, సుప్రీకోర్టు చెప్పినప్పటికీ దుష్ప్రచారాలు చేస్తున్నారని, ప్రజలను పక్కదారి పట్టించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోందని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు. కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై గాంధీభవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. విపక్షాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన మాట్లాడుతూ.. రాజధాని లో ఉంటున్న అందరికీ నాణ్యమైన జీవనం అందించాలని, మూసీ పరివాహక ప్రాంతంలో ఉంటున్న వారికి స్వచ్ఛమైన గాలి, వాతావరణం ఇవ్వాలని భావించామని అన్నారు. నగరంలో నాణ్యమైన జీవనంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు పెంచాలని నిర్ణయించామని తెలిపారు.

ప్రస్తుతం హైదరాబాద్ లో జనసాంద్రత విపరీతంగా పెరిగడంతో ఫ్యూచర్ సిటీని నిర్మించాలని నిర్ణయించామని చెప్పారు. ప్రైవేట్ పరం కాబోతున్న 400 ఎకరాల భూమిని ప్రభుత్వం కాపాడిందని,
కంచ గచ్చిబౌలి భూములు ప్రభుత్వానివే అని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిందని అన్నారు. సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, ఏఐ వీడియోలు సృష్టించి తప్పుడు ప్రచారం
చేస్తున్నారని.. సామాజిక మాధ్యమాల్లో ఫేక్ వీడియోలు వైరల్ చేసి దుష్ప్రచారం చేస్తున్నారని ఫైర్
అయ్యారు. హెచ్సీయూ భూములు, పరిసరాల్లో ఏనుగులు ఉన్నాయా? అంటూ.. విద్యార్థులను
ప్రభావితం చేసిన ప్రభుత్వ పనులను అడ్డుకోవాలని చూస్తున్నారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news