తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె ఏ పాల్ అమరవీరుల స్తూపం వద్ద గురువారం నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టిఆర్ఎస్ ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు. తెలంగాణ కోసం కెసిఆర్ కుటుంబంలో ఎవరూ బలి కాలేదని అన్నారు. అమరవీరుల కుటుంబాలను ప్రజాశాంతి పార్టీ తరఫున ఆదుకుంటామని అన్నారు.1200 కుటుంబాలకు అన్నివిధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ప్రజాశాంతి పార్టీ అమరవీరుల కుటుంబాల కోసం పోరాటం చేస్తుందని, ఉచిత విద్య, వైద్యం అందిస్తామన్నారు. ప్రజాశాంతి పార్టీ తరఫున శ్రీకాంతాచారి తండ్రిని ఎమ్మెల్యేగా నిలబెడతామని అన్నారు కెఏ పాల్. శ్రీకాంతాచారి బలిదానం చేసుకున్న డిసెంబర్ 3న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించాలని కే ఏ పాల్ డిమాండ్ చేశారు.