హైదరాబాద్ లో పబ్స్ లేకుండా బంద్ చేస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. ఇవాళ పబ్ ఓనర్లతో సమావేశం అయిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ అనంతరం మీడియాతో మాట్లాడారు. పబ్ లో డ్రగ్స్ అమ్మితే పీడి యాక్ట్ పెడతామని.. చట్టాన్ని ఉపయోగించి అవసరం అయితే నగర బహిష్కరణ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు.
డ్రగ్స్ దందా చేయాలనుకునే వాళ్ళు దేశం విడిచి వెళ్ళండని… ఇక్కడ ఇటువంటి దందా చేస్తామంటే చూస్తూ ఊరుకోమని ఓ రేంజ్ లో హెచ్చరించారు. రాష్ట్ర సర్కార్ కు డబ్బు ముఖ్యం కాదు…అవసరం అయితే మొత్తం బంద్ చేపిస్తామని పేర్కొన్నారు.
అవసరం అయితే పబ్స్ లేకుండా కూడా చేస్తామని.. డబ్బే ప్రధానంగా ఈ దందా చేయాలనుకుంటే వారిని వదిలి పెట్టమని వార్నింగ్ ఇచ్చారు. పోలీసు, ఎక్సైజ్ శాఖ సహకారంతో చర్యలను ముమ్మరం చేస్తున్నాం..మీరు ఇలానే చేస్తే నగరంలో పూర్తిగా పబ్స్ లేకుండా అవుతుంది…నియమ నిబంధనలకు అనుగుణంగా నడిపించుకోవాలని పేర్కొన్నారు. 24 హావర్స్ పర్మిషన్ ఉన్న వాటిలో కేవలం సర్వీస్ మాత్రమే చేయాలి… సీసీ కెమెరాలను ఎక్సైజు డిపార్మెంట్ కి అటాచ్ చేస్తామని స్పష్టం చేశారు.