ఉత్తర తెలంగాణకు శ్రీరాంసాగర్ ఆయువు పట్టు : జీవన్ రెడ్డి

-

పసుపు ఏర్పాటు చేస్తానని ధర్మపురి అరవింద్ బాండ్ పేపర్ రాసిచ్చారు.. ఏమైంది అని ప్రశ్నించారు నిజామాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి. తాజాగా నిజామాబాద్ లో నిర్వహించిన కాంగ్రెస్ జన జాతర సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యంగా అన్ని వర్గాల సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అన్నారు. ఉత్తర తెలంగాణకు శ్రీరాంసాగ్ ఆయువు పట్టు.. తాగునీరు అయినా.. సాగునీరు అయినా శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచే.. పసుపు బోర్డు పైకేంద్రం ఇచ్చిన ఉత్తర్వు బోగస్ అన్నారు.

బోర్డు ఎక్కడ పెడుతారో తెలియకుండా ఉత్తర్వులు ఏంటి అని ప్రశ్నించారు.  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. నిజామాబాద్ గడ్డ పై పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు పై కవిత నిర్లక్ష్యం చేశారు. చక్కర ప్రాజెక్ట్ ని పున: ప్రారంభిస్తామని తెలిపారు. ఒకనాడు క్వింటా పసుపు అమ్మితే తులం బంగారం వచ్చేది. కానీ నేడు ఆ పరిస్థితి లేకుండా పోయింది అన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. 

Read more RELATED
Recommended to you

Exit mobile version