కేంద్రమంత్రి బండి సంజయ్ కి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ వార్నింగ్..!

-

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పై నోరు పారేసుకుంటే సహించేది లేదని కేంద్రమంత్రి బండి సంజయ్ ని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. రాష్ట్ర పథకాలకు, ఇండ్లకు ఇందిరమ్మ పేరు పెడితే ఎందుకు డబ్బులు ఇవ్వరో చూస్తామని హెచ్చరించారు. బండి సంజయ్ ఇంట్లో నుంచి డబ్బులు ఇవ్వడం లేదని.. ఇందిరమ్మ పేరు పెడితే డబ్బులు ఇవ్వరా..? అని ప్రశ్నించారు. ఎలా ఇవ్వరో మేము చూస్తామన్నారు. ఇందిరను బీజేపీ ప్రధాని వాజ్ పేయి కాళీమాతతో పోల్చారని గుర్తు చేశారు.

పది నెలల కాలంలో జీఎస్టీ రూపంలో రూ.37వేల కోట్లను కేంద్రం వసూలు చేసిందన్నారు. మరి కేంద్రం తెలంగాణను ఇచ్చింది ఎంత అని ప్రశ్నించారు. దీన్ దయాల్ అంత్యోదయ, దీన్ దయాల్ గృహ జ్యోతి లాంటి పేర్లు పథకాలకు కేంద్రం ఎందుకు పెట్టిందని ప్రశ్నించారు. వాల్లు ఏమైనా దేశం కోసం ప్రాణత్యాగం చేశారా..? అని ధ్వజమెత్తారు. భారతీయులు ఇందిరమ్మను ఇంకొక్కమాట అన్న ఊరుకోరని హెచ్చరించారు. తెలంగాణ నుంచి ఉన్న ఇద్దరూ కేంద్ర మంత్రులు ఒక్క రూపాయి అయినా కేంద్రం నుంచి అదనంగా తెచ్చారా..? అనే ప్రశ్నకు ముందు బండి సంజయ్ సమాధానం చెప్పాలన్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news